ప్రజల సౌకర్యార్థం పోలీస్ హెల్ప్ లైన్
దిశ, మహబూబ్నగర్: అత్యవసర పరిస్థితుల్లో ప్రజల కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. అనారోగ్య పరిస్థితులు, మరణాలు, అంత్యక్రియలు వంటి విషాద పరిస్థితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. అయితే, అత్యవసర పరిస్థితులు ఎదురయినప్పుడు 08542-243300, 243399 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. కర్ఫ్యూ సమయాల్లో […]
దిశ, మహబూబ్నగర్: అత్యవసర పరిస్థితుల్లో ప్రజల కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. అనారోగ్య పరిస్థితులు, మరణాలు, అంత్యక్రియలు వంటి విషాద పరిస్థితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. అయితే, అత్యవసర పరిస్థితులు ఎదురయినప్పుడు 08542-243300, 243399 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. కర్ఫ్యూ సమయాల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ల మీదకు రావొద్దని ఆమె తెలిపారు.
tag: Police Helpline, convenience, public, lockdown, mahabubnagar