సరిహద్దుల్లో కలకలం.. పట్టుబడిన పులి చర్మం..

దిశ, ములుగు: పులి చర్మం అమ్మడానికి ఛత్తీస్ గఢ్ నుండి కొందరు తెలంగాణ వస్తున్నారని పోలీసులకు ముందస్తు సమాచారం వచ్చింది. దాంతో వెంకటాపురం సిఐ కే. శివ ప్రసాద్ ఇతర పోలీస్ సిబ్బంది కలిసి జగన్నాధపురం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన 5 గురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారి నుంచి రెండు బైక్ లను స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. ఒక బ్రౌన్ కలర్ సంచిలో పులి చర్మం గుర్తించారు. పులి […]

Update: 2021-12-21 07:40 GMT

దిశ, ములుగు: పులి చర్మం అమ్మడానికి ఛత్తీస్ గఢ్ నుండి కొందరు తెలంగాణ వస్తున్నారని పోలీసులకు ముందస్తు సమాచారం వచ్చింది. దాంతో వెంకటాపురం సిఐ కే. శివ ప్రసాద్ ఇతర పోలీస్ సిబ్బంది కలిసి జగన్నాధపురం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన 5 గురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారి నుంచి రెండు బైక్ లను స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. ఒక బ్రౌన్ కలర్ సంచిలో పులి చర్మం గుర్తించారు.

పులి చర్మాన్ని పరిశీలించి దూలపురం FROకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన FRO అది నిజమైన పులి చర్మంగా గుర్తించారు. పట్టుబడిన ఐదుగురిని విచారించి వారిని పూనెం విఘ్నేష్, సోయం రమేష్, చిరా శ్రీను, చింతల బాల కృష్ణ, సోది చంటి లుగా గుర్తించారు. నిందితుల నుండి ఒక పులి చర్మం, రెండు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం పోలీసులు వీరిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

Tags:    

Similar News