బ్రేకింగ్: అబార్షన్లు చేస్తూ రెడ్‌హ్యండెడ్‌గా దొరికిన డాక్టర్..

దిశ, కాళోజి జంక్షన్ : హన్మకొండ జిల్లా కేంద్రంలో యథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిర్వహిస్తూ అడ్డంగా అధికారులకు దొరికిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకజీ కాలనీలో గత కొన్ని నెలల నుంచి ఓ ల్యాబ్ టెక్నీషియన్ అండదండలతో డాక్టర్ సబిత, ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులు అబార్షన్ల దందాకు తెరలేపారు. అయితే ఈ దందాపై సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు పోలీసులతో కలిసి దాడి చేశారు. […]

Update: 2021-09-13 04:16 GMT

దిశ, కాళోజి జంక్షన్ : హన్మకొండ జిల్లా కేంద్రంలో యథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిర్వహిస్తూ అడ్డంగా అధికారులకు దొరికిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకజీ కాలనీలో గత కొన్ని నెలల నుంచి ఓ ల్యాబ్ టెక్నీషియన్ అండదండలతో డాక్టర్ సబిత, ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులు అబార్షన్ల దందాకు తెరలేపారు. అయితే ఈ దందాపై సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు పోలీసులతో కలిసి దాడి చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు వైద్యం కోసం వస్తే లింగనిర్ధారణ చేసి అబార్షన్ చేయించుకోవాలనుకునే వారిని ఇక్కడికి పంపించి గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగాన్ని ముగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరు కాకజీ కాలనీలో ఒక రూమ్ అద్దెకు తీసుకొని అందులో ఈ దందా మొదలు పెట్టారు. అధికారులు దాడి చేసే సమయంలోనూ అబార్షన్‌ కోసం 9 మంది మహిళలు వచ్చినట్లు తెలిపారు. ఈ దాడిలో లింగ నిర్ధారణ యంత్రంతో పాటు డాక్టర్ సబిత, ప్రవీణ్ లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రవీణ్ నిత్యశ్రీ పాలీ క్లినిక్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News