పట్టుబడ్డ కంత్రి కపుల్స్.. ఇక శ్రీకృష్ణజన్మ స్థానమే..
దిశ, చండూరు : అమాయకులైన నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట ఆశ చూపి ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలకు లక్షలు తీసుకుని మోసం చేసిన కంత్రి కపుల్స్‌ను మర్రిగూడ పోలీసులు అరెస్ట్ రిమాండ్ పేరిట దేవరకొండకు తరలించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేటకు చెందిన గాలిబ్, రమాదేవి దంపతులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడి అరెస్ట్ అయ్యారు. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న గాలిబ్ తనకున్న చెడు అలవాట్ల కోసం అక్రమంగా డబ్బు సంపాదించడానికి తెరలేపాడు. మర్రిగూడ మండలంలోని తిరుగండ్లపల్లి […]
దిశ, చండూరు : అమాయకులైన నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట ఆశ చూపి ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలకు లక్షలు తీసుకుని మోసం చేసిన కంత్రి కపుల్స్‌ను మర్రిగూడ పోలీసులు అరెస్ట్ రిమాండ్ పేరిట దేవరకొండకు తరలించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేటకు చెందిన గాలిబ్, రమాదేవి దంపతులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడి అరెస్ట్ అయ్యారు. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న గాలిబ్ తనకున్న చెడు అలవాట్ల కోసం అక్రమంగా డబ్బు సంపాదించడానికి తెరలేపాడు.
మర్రిగూడ మండలంలోని తిరుగండ్లపల్లి గ్రామానికి చెందిన రజినీకాంత్ దగ్గర లక్ష రూపాయలు ఉద్యోగం ఇప్పిస్తానని వసూలు చేశారు. అనంతరం చింతపల్లి మండలానికి చెందిన ఐదుగురు నిరుద్యోగుల దగ్గర లక్ష నుండి లక్షా యాభై వేల వరకు వసూలు చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలానికి చెందిన నలుగురి దగ్గర ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారు.
అలాగే మాడుగుల మండలంలో మరో ఇద్దరి దగ్గర డబ్బులు మొత్తంగా 15 లక్షల 50 వేల రూపాయలను వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. విచారణలో నిందితుడు గాలిబ్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజుల విచారణ అనంతరం రిమాండ్ పేరిట కంత్రి కపుల్స్ ను దేవరకొండకు తరలించారు పోలీసులు.