వామన్ రావు మర్డర్ కేసు… పోలీసుల అదుపులో ఏ5!

దిశ ప్రతినిధి, కరీంనగర్: సంచలనం సృష్టించిన హైకోర్టు అడ్వకేట్లు గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసులో ముగ్గురు నింందితులను విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌లను ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మంథని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో మరిన్ని కోణాల్లో విచారించాల్సి ఉందని, మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు వారిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు సోమవారం […]

Update: 2021-02-24 06:59 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: సంచలనం సృష్టించిన హైకోర్టు అడ్వకేట్లు గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసులో ముగ్గురు నింందితులను విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌లను ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మంథని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో మరిన్ని కోణాల్లో విచారించాల్సి ఉందని, మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు వారిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు అనుమతి ఇవ్వడంతో గురువారం ముగ్గురిని పోలీసులు జైలు నుండి తీసుకెళ్లి విచారించనున్నారు.

పోలీసుల అదుపులో ఏ5

ఈ కేసులో ఐదో నిందితునిగా ఉన్న లచ్చయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వామన్ రావు దంపతుల హత్య కేసులో లచ్చయ్య ప్రమేయం ఏంటీ, హత్య కోసం వేసిన స్కెచ్ గురించి ఎంత మేరకు తెలుసు అన్న కోణాల్లో ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News