న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నజర్
దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకల ప్రత్యేక కార్యక్రమాలకు అనుమతి లేని నేపథ్యంలో నగర పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పై ప్రత్యేక చర్యలకు పూనుకుంటున్నారు. ఇప్పటికే పబ్బులు, రిసార్ట్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్ దుకాణాలు సాధారణ వేళలలో మాత్రమే పనిచేయాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ప్రకటించి, ప్రత్యేక ఈవెంట్లకు అనుమతులు లేవని తెలిపారు. డిసెంబరు 31న రాత్రి పబ్బులు, బార్లు, రిసార్ట్స్, ఇతర మద్య కేంద్రంగా నిర్వహించే వ్యాపార వేదికలపై హైదరాబాద్ […]
దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకల ప్రత్యేక కార్యక్రమాలకు అనుమతి లేని నేపథ్యంలో నగర పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పై ప్రత్యేక చర్యలకు పూనుకుంటున్నారు. ఇప్పటికే పబ్బులు, రిసార్ట్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్ దుకాణాలు సాధారణ వేళలలో మాత్రమే పనిచేయాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ప్రకటించి, ప్రత్యేక ఈవెంట్లకు అనుమతులు లేవని తెలిపారు. డిసెంబరు 31న రాత్రి పబ్బులు, బార్లు, రిసార్ట్స్, ఇతర మద్య కేంద్రంగా నిర్వహించే వ్యాపార వేదికలపై హైదరాబాద్ నగరంలోని పోలీసులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. దీంతో ముందస్తుగా హెచ్చరికగా వాహనదారులు అప్రమత్తంగా ఉండేందుకు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఎండీ తాజుద్దీన్ అహ్మద్ లు డిసెంబరు నెలలో పట్టుబడిన డ్రంకెన్ డ్రైవ్ వివరాలను ఆదివారం వేర్వేరుగా ప్రకటించారు.
మోటారు వాహనాల చట్టం ప్రకారం తాగి డ్రైవింగ్ చేస్తే సెక్షన్ 185 ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు కోర్టులో చార్జీషీటు దాఖలు చేస్తామని హెచ్చరించారు. మొదటి సారి పట్టుబడితే రూ.10వేల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష, రెండో సారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా లేదా 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతోందని తెలిపారు. అంతేగాక, మొదటి సారి ఉల్లంఘనకు డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 నెలలు రద్దు, రెండో సారి ఉల్లంఘిస్తే శాశ్వతంగా రద్దు చేసేందుకు అధికారులకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిసెంబరు నెలలో మొత్తం 2,351 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3,287 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యయి. 2020 ఏడాదికి మొత్తానికి 33డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు అయినట్టు అధికారులు తెలిపారు.