సూర్యాపేట : ఫోన్ చేస్తేనే.. అంబులెన్స్ కు అనుమతి
దిశ, కోదాడ : ఏపీ నుంచి వచ్చే కరోనా రోగుల అంబులెన్స్ లను ఆపివేస్తున్న వైనం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం విజయవాడ నుంచి వస్తున్న ఓ కొవిడ్ అంబులెన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. అన్ని అనుమతి పత్రాలు చూపించినా.. అంబులెన్స్ ను పోలీసులు తెలంగాణలోకి అనుమతించలేదని బాధితులు వాపోతున్నారు.. ఆసుపత్రి ల్యాండ్ లైన్ నుంచి పోలీసులకు ఫోన్ చేస్తే తప్పా తెలంగాణలోకి […]
దిశ, కోదాడ : ఏపీ నుంచి వచ్చే కరోనా రోగుల అంబులెన్స్ లను ఆపివేస్తున్న వైనం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం విజయవాడ నుంచి వస్తున్న ఓ కొవిడ్ అంబులెన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. అన్ని అనుమతి పత్రాలు చూపించినా.. అంబులెన్స్ ను పోలీసులు తెలంగాణలోకి అనుమతించలేదని బాధితులు వాపోతున్నారు.. ఆసుపత్రి ల్యాండ్ లైన్ నుంచి పోలీసులకు ఫోన్ చేస్తే తప్పా తెలంగాణలోకి ప్రవేశం లేదని తేల్చిచెపడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రోగికి ఏమైనా జరిగితే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పేషెంట్ ను రక్షించాలని వేడుకున్నారు. ఆసుపత్రి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేయిచడం ఆలస్యం అవుతుండటంతో రోగులు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.