తమ్ముడిని, తల్లిని హతమార్చిన అన్న.. సహకరించిన భార్య
దిశ సూర్యాపేట: రెండు ఇళ్ల మధ్య మురికి నీరు కారణంగా జరిగిన చిన్న వివాదం కన్న తల్లిని తోడబుట్టిన తమ్మున్ని హత్యకు దారి తీసిందని సూర్యాపేట డీఎస్పీ ఎస్. మోహన్ కుమార్ అన్నారు. గత నెల 28 న ఆత్మకూర్ ఎస్.. మండలపరిధిలోని కందగట్ల గ్రామం లో జరిగిన జంట హత్యల నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు మంగళవారం ఆత్మకూర్ ఎస్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. […]
దిశ సూర్యాపేట: రెండు ఇళ్ల మధ్య మురికి నీరు కారణంగా జరిగిన చిన్న వివాదం కన్న తల్లిని తోడబుట్టిన తమ్మున్ని హత్యకు దారి తీసిందని సూర్యాపేట డీఎస్పీ ఎస్. మోహన్ కుమార్ అన్నారు. గత నెల 28 న ఆత్మకూర్ ఎస్.. మండలపరిధిలోని కందగట్ల గ్రామం లో జరిగిన జంట హత్యల నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు మంగళవారం ఆత్మకూర్ ఎస్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు.
మృతుడు తూర్పటి శ్రీను, ముద్దాయి తుర్పాటి లచ్చయ్యలు తోడబుట్టిన అన్నదమ్ములు. ఇద్దరి ఇండ్లు పక్కన ఉండడంతో తరుచు లచ్చయ్య ఇంటి నుండి వాడిన మురికి నీరు శ్రీను ఇంట్లోకి వస్తున్నాయి. ఈ విషయమై శ్రీను, లచ్చయ్యకు పలు మార్లు చెప్పిన పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే జూన్ 28న మరోసారి మురికి నీరు శ్రీను ఇంట్లోకి రావడంతో వారిద్దరి ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అదే సమయంలో లచ్చయ్య భార్య లచ్చమ్మ తన ఇంట్లో ఉన్న బల్లెం తెచ్చి భర్తకు ఇవ్వడంతో లచ్చయ్య ఆవేశంలో తమ్ముడు శ్రీనును విచక్షణ రహితంగా పొడిచాడు. కొడుకు అరుపులు విన్న తల్లి మారేమ్మ ఇంట్లో నుండి వచ్చి శ్రీనుపై దాడికి అడ్డుపడగా తల్లి మారేమ్మను కూడా లచ్చయ్య అదే బల్లెంతో పొడిచి హతమార్చాడు. దాంతో శ్రీను, మారేమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.
ఇంటి ప్లాట్ వివాదంలో కూడా తరుచు అన్న దమ్ముల మధ్య వివాదాలు ఉండేవని, పరారిలో ఉన్న లచ్చయ్య, భార్య లచ్చమ్మను మంగళవారం నెమ్మికల్ సమీపంలో పోలీస్ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ఎస్. మోహన్ కుమార్ తెలిపారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అన్న తూర్పటి లచ్చయ్య సహకరించిన భార్య లచ్చమ్మను రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో రూరల్ సీఐ విఠల్ రెడ్డి, ఎస్ ఐ లింగయ్య, ట్రైని ఎస్ఐలు రాంబాబు, సురేష్ రెడ్డి, సత్యనారాయణ, భగవాన్ నాయక్,గౌతమి నరేష్, మహేష్ వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.