వాజేడు ఏజెన్సీలో టెన్షన్ టెన్షన్.. ఎదురుపడితే కాల్పుల మోతేనా..?
దిశ, వాజేడు : ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలం ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం నుంచి మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభం కావడం, మరోవైపు పోలీస్ వర్గాలు ఎక్కడికక్కడ అప్రమత్తమై పోలీసు బలగాలను మోహరించి అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని ఏజెన్సీ ప్రజానీకం భయాందోళనకు గురవుతోంది. ఇప్పటికే అప్రమత్తమైన పోలీసులు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. మావోయిస్టు […]
దిశ, వాజేడు : ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలం ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం నుంచి మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభం కావడం, మరోవైపు పోలీస్ వర్గాలు ఎక్కడికక్కడ అప్రమత్తమై పోలీసు బలగాలను మోహరించి అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని ఏజెన్సీ ప్రజానీకం భయాందోళనకు గురవుతోంది. ఇప్పటికే అప్రమత్తమైన పోలీసులు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు.
మావోయిస్టు టార్గెట్ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపడం దీనితో అప్రమత్తమైన పోలీస్ వర్గాలు ఏటూరునాగారం ఏఎస్పీ ఆలం గౌస్ ఆధ్వర్యంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని అడవులను జల్లెడ పడుతూ మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మావోయిస్టు వారోత్సవాలకు సరిహద్దు ప్రాంతాల నుండి ఎవరైనా వెళుతున్నారా? అనే అంశంపై దృష్టి పెట్టి ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్టు సమాచారం.
నేటి నుండి మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభం కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో ఈ ప్రాంత వాసులు కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒకవైపు పోలీసులు అడవుల్లో తనిఖీలు చేపడుతుంటంతో మరోవైపు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తూ తమ ఉనికిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి.