మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు తరలింపు
దిశ, మంచిర్యాల: మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు అక్రమంగా గ్లైఫోసెట్‌ను తరలిస్తున్న వ్యక్తులను రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పక్క సమాచారంతో గురువారం జరిపిన దాడుల్లో వీరిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. వివరాళ్లోకి వెళితే… సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ కిరణ్, ఎస్ఐ కిరణ్‌ల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ నుంచి ఆటోలో నెన్నెల మండలానికి నిషేధిత గ్లైఫోసెట్ తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో నెన్నెల మండలం గొల్లపల్లి […]
దిశ, మంచిర్యాల: మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు అక్రమంగా గ్లైఫోసెట్‌ను తరలిస్తున్న వ్యక్తులను రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పక్క సమాచారంతో గురువారం జరిపిన దాడుల్లో వీరిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. వివరాళ్లోకి వెళితే… సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ కిరణ్, ఎస్ఐ కిరణ్‌ల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ నుంచి ఆటోలో నెన్నెల మండలానికి నిషేధిత గ్లైఫోసెట్ తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామం శివారులో మాటు వేసి పట్టుకున్నారు. టాటా మ్యాజిక్ ఆటోలో తరలిస్తున్న సుమారు 270 లీటర్ల గ్లైఫోసెట్, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గ్లైఫోసెట్ విలువ సుమారు రూ.1 లక్షా 35 వేల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టుకున్న నిందితులను, గ్లైఫోసైట్‌ను, టాటా మ్యాజిక్ ఆటో, బైక్‌ను పోలీస్ స్టేషన్ తరలించారు. తరలిస్తున్న వ్యక్తులు అల్లంపల్లి సంతోష్, గురునాధం నాగరాజు, అల్లూరి సన్నిలను పట్టుకున్నారు.