ఎల్జీ పాలిమర్స్ పై కేసులివే

విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన వందలాది మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ లీక్, పలువురి మరణాలకు కారణమైన నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 278, 284, 285, 337, 338, 304ల కింద గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విష […]

Update: 2020-05-08 01:39 GMT

విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన వందలాది మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ లీక్, పలువురి మరణాలకు కారణమైన నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 278, 284, 285, 337, 338, 304ల కింద గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విష వాయువులతో వాతావరణాన్ని కలుషితం చేయడం, మానవ జీవనానికి హాని కలిగించడం, నిర్లక్ష్యం, పరిస్థితిని అదుపు చేయకపోవడం, హత్యాయత్నం తదితర కారణాలతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

tags: lg polymers, police case, gopalapatnam police station

Tags:    

Similar News