ప్లీజ్ మా డాడీని కొట్టకండి.. వెక్కి వెక్కి ఏడ్చిన కూతురు (వీడియో)

దిశ, మహబూబాబాద్: మానుకోటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాస్కు, హెల్మెట్ తప్పనిసరి అంటూ ఆదివారం మహబూబాబాద్ జిల్లా మానుకోటలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ వివాదాస్పదంగా మారింది. ద్విచక్ర వాహనదారుడి వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతురితో మహబూబాబాద్‌‌లో కూరగాయలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళుతున్నాడు. మార్గంమధ్యలో కురవి గేట్ సమీపంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అదే మార్గం గుండా వెళ్తోన్న శ్రీనివాస్‌ను పోలీసులు ఆపి […]

Update: 2021-12-05 07:58 GMT

దిశ, మహబూబాబాద్: మానుకోటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాస్కు, హెల్మెట్ తప్పనిసరి అంటూ ఆదివారం మహబూబాబాద్ జిల్లా మానుకోటలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ వివాదాస్పదంగా మారింది. ద్విచక్ర వాహనదారుడి వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతురితో మహబూబాబాద్‌‌లో కూరగాయలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళుతున్నాడు. మార్గంమధ్యలో కురవి గేట్ సమీపంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

ఈ సమయంలో అదే మార్గం గుండా వెళ్తోన్న శ్రీనివాస్‌ను పోలీసులు ఆపి బండితాళం లాక్కున్నారు. తాళం ఎందుకు తీసుకున్నారని అడిగితే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నావని తిట్టారని, దానికి ఫైన్ కడుతానని చెప్పినా వినిపించుకోకుండా ఎదురు సమాధానం చెప్పానని రోడ్డుపైనే విపరీతంగా కొట్టారని సదరు ద్విచక్ర వాహనదారుడు వాపోయాడు. అయితే, పోలీసులు శ్రీనివాస్‌ని కొడుతున్న సమయంలో పక్కనే ఉన్న అతని కూతురు ‘ప్లీజ్ మా డాడీని కొట్టొద్దు’ అని పోలీసుల ఎదుట వెక్కి వెక్కి ఏడ్చినట్లు సమాచారం. కూతురు రోదించడం చూసిన శ్రీనివాస్ పోలీసుల తీరుకు నిరసిస్తూ రోడ్డుపైనే బైటాయించి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఉదంతం మొత్తం స్థానికులు వీడియోలు తీసి, సోషల్ మీడియాల్లో అప్లోడ్ చేయగా, అవి కాస్త వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News