ఏజెన్సీలో నిరుద్యోగ యువతకు పోలీసుల భరోసా.. ప్రత్యేక శిక్షణ

దిశ, దుమ్ముగూడెం : ఏజెన్సీలోని నిరుద్యోగ యువతి, యువకులకు పోలీస్ శాఖ భరోసా కల్పిస్తుందని భద్రాచలం ఏఎస్పీ వినీత్ జీ అన్నారు. ఎస్ఎస్‌సీ జీడీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న 14 మంది యువకులకు నెల రోజుల పాటు పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 14 మంది యువకులకు నెల రోజుల పాటు వసతి, […]

Update: 2021-11-22 09:49 GMT

దిశ, దుమ్ముగూడెం : ఏజెన్సీలోని నిరుద్యోగ యువతి, యువకులకు పోలీస్ శాఖ భరోసా కల్పిస్తుందని భద్రాచలం ఏఎస్పీ వినీత్ జీ అన్నారు. ఎస్ఎస్‌సీ జీడీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న 14 మంది యువకులకు నెల రోజుల పాటు పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 14 మంది యువకులకు నెల రోజుల పాటు వసతి, భోజన వసతి, స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు.

అలాగే ఈ శిక్షణలో పరీక్షల నిర్వహణపై అవగాహన, ప్రతీ రోజు గ్రౌండ్‌లో ఫిజికల్ ట్రైనింగ్ వారికి నేర్పించినట్టు చెప్పారు. యువకులకు శిక్షణ ఇవ్వడం కోసం కృషి చేసిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు, అలాగే యువకులకు తరగతులు నిర్వహించిన ఎంఈఓ సున్నం సమ్మయ్య, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు.

 

Tags:    

Similar News