దోపిడీ ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ దగ్గర దోపిడీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం తమిళనాడు జిల్లా హోసూరు దగ్గర ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడిన ముఠాగా నిర్ధారించారు. సెక్యూరిటీ గార్డును తుపాకీతో బెదిరించి ముత్తూట్ ఫైనాన్స్‌లో రూ.7కోట్ల మేర సొత్తు అపహరించిన దుండగుల కోసం.. తమిళనాడు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం శంషాబాద్ సమీపంలో తనిఖీలు నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు.. తమిళనాడులో చోరీకి పాల్పడిన దొంగల ముఠాను అరెస్ట్ […]
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ దగ్గర దోపిడీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం తమిళనాడు జిల్లా హోసూరు దగ్గర ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడిన ముఠాగా నిర్ధారించారు. సెక్యూరిటీ గార్డును తుపాకీతో బెదిరించి ముత్తూట్ ఫైనాన్స్‌లో రూ.7కోట్ల మేర సొత్తు అపహరించిన దుండగుల కోసం.. తమిళనాడు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం శంషాబాద్ సమీపంలో తనిఖీలు నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు.. తమిళనాడులో చోరీకి పాల్పడిన దొంగల ముఠాను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నారు.