పోలీసుల పేరుతో టోకరా.. ముఠా అరెస్టు..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పోలీసు ఉన్నతాధికారుల పేర్లను వాడుకుని నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను మహబూబ్ నగర్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ముఠాపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 12 కేసులు ఉన్నట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ… పోలీసు ఉన్నతాధికారుల పేర్లను చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ఈ ముఠా సభ్యులు మోసం చేస్తున్నారని అన్నారు. దీంతో హన్వాడకు […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పోలీసు ఉన్నతాధికారుల పేర్లను వాడుకుని నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను మహబూబ్ నగర్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ముఠాపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 12 కేసులు ఉన్నట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ… పోలీసు ఉన్నతాధికారుల పేర్లను చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ఈ ముఠా సభ్యులు మోసం చేస్తున్నారని అన్నారు. దీంతో హన్వాడకు చెందిన అక్కపల్లి చంద్రశేఖర్, నంచెర్ల గ్రామం గాండీడ్ మండలానికి చెందిన దొమ్మరిరవి, తిమాజిపేట మండలం అవ్వంచాకు చెందిన మాదాసు బాలయ్య, మాదాసు తేజలను అరెస్టు చేశామని తెలిపారు. కాగా జడ్చర్లకు చెందిన జక్కరయ్య అనే నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. వీరి నుండి 2 సెల్ ఫోన్లు, 1 అపాచీ బైక్, 1 బుల్లెట్ బైక్, 2 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.