50 మంది ఎన్ఎస్‌యూఐ నాయకుల అరెస్ట్
దిశ, కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ… ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు అమలులో ఉంటే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలనుకోవడం ఏమాత్రం సమంజసం కాదని, హైకోర్టులో కేసు ఉన్నా.. ప్రభుత్వం దూకుడుగా వ్యవహిరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థుల […]
దిశ, కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ…
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు అమలులో ఉంటే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలనుకోవడం ఏమాత్రం సమంజసం కాదని, హైకోర్టులో కేసు ఉన్నా.. ప్రభుత్వం దూకుడుగా వ్యవహిరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే పరీక్షలు నిర్వహించే ఆలోచనను విరమించుకోవాలని డిమాంద్ చేశారు. కలెక్టరేట్ ముట్టడికి వెలుతున్న సుమారు 50 మంది ఎన్ఎస్‌యూఐ నాయకులను పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలిపారు.