రేపు సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్..!
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ అమలు తీరుపై చర్చించేందుకు ప్రధాని మోడీ, సీఎంలతో సోమవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు సమాచారం. మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశంలో లాక్‌డౌన్ ఈ నెల 17న ముగియనుండగా, దీనిని మరోసారి పొడిగించాలా? లేక మరిన్ని సడలింపులు ఇవ్వాలా అన్నదానిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఆదివారం ఉదయం కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ […]
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ అమలు తీరుపై చర్చించేందుకు ప్రధాని మోడీ, సీఎంలతో సోమవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు సమాచారం. మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశంలో లాక్‌డౌన్ ఈ నెల 17న ముగియనుండగా, దీనిని మరోసారి పొడిగించాలా? లేక మరిన్ని సడలింపులు ఇవ్వాలా అన్నదానిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఆదివారం ఉదయం కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో చాలా రాష్ట్రాలు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలోని నియమాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా, వలస కార్మికులు స్వరాష్ట్రాలకు చేరుకుంటుండటంతో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయనీ, దీంతో అనేక జిల్లాలు రెడ్ జోన్‌లుగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితి సాధారణ స్థితికి రావడం చాలా కష్టమని తెలిపాయి. కావున, ప్రస్తుతం దిగ్బంధ కేంద్రాలు (క్వారంటైన్ సెంటర్)గా ఉన్న ఏరియాలను రెడ్‌జోన్‌లుగా పరిగణించాలని సూచించినట్టు తెలుస్తోంది.