కరోనాపై సార్క్.. ఐడియా స్పార్క్
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోరాడేందుకు బలమైన వ్యూహాన్ని రూపొందించాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని దక్షిణాసియా (సార్క్) దేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. కోవిడ్ – 19 పై మేం పోరాడుతున్నామని, వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు మరియు ప్రజలు కరోనాను ఎదుర్కొనేందుకు పలు విధాలుగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 5 వేల […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోరాడేందుకు బలమైన వ్యూహాన్ని రూపొందించాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని దక్షిణాసియా (సార్క్) దేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. కోవిడ్ – 19 పై మేం పోరాడుతున్నామని, వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు మరియు ప్రజలు కరోనాను ఎదుర్కొనేందుకు పలు విధాలుగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 5 వేల మంది మృతి చెందడానికి కరోనా కారణమైందని, ఈ మహమ్మారి వైరస్ పై పోరాటం చేసేందుకు సార్క్ దేశాలు నాయకత్వం వహించి ఓ వ్యూహాన్ని రూపొందించాలని ప్రధానమంతి అందులో పేర్కొన్నారు.
I would like to propose that the leadership of SAARC nations chalk out a strong strategy to fight Coronavirus.
We could discuss, via video conferencing, ways to keep our citizens healthy.
Together, we can set an example to the world, and contribute to a healthier planet.
— Narendra Modi (@narendramodi) March 13, 2020
Tags: corona, modi, saarc, social media