పిల్లలపై బొమ్మల ప్రభావం: మోడీ
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తులు పెంచడంపై దృష్టి కేంద్రీకరించాలని కోరుతూ యువ ఔత్సాహికులు ఆట బొమ్మల తయారీకి నడుం బిగించాలని ప్రధాన మంత్రి మోడీ పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా సాగి సమస్త ప్రపంచానికి ఆట బొమ్మల కేంద్రంగా నిలిచే సత్తా దేశానికి ఉన్నదని తెలిపారు. ప్రధాని మోడీ ఆదివారం రేడియో ప్రోగ్రామ్ ‘మన్ కీ బాత్’లో మాట్లాడారు. ప్రస్తుత తరుణంలో యువ మిత్రుల గురించి ఆలోచిస్తుంటారని చెబుతూ, వారు ఆట బొమ్మలను ఎలా సమకూర్చుకుంటున్నారని మధనపడుతున్నట్టు […]
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తులు పెంచడంపై దృష్టి కేంద్రీకరించాలని కోరుతూ యువ ఔత్సాహికులు ఆట బొమ్మల తయారీకి నడుం బిగించాలని ప్రధాన మంత్రి మోడీ పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా సాగి సమస్త ప్రపంచానికి ఆట బొమ్మల కేంద్రంగా నిలిచే సత్తా దేశానికి ఉన్నదని తెలిపారు. ప్రధాని మోడీ ఆదివారం రేడియో ప్రోగ్రామ్ ‘మన్ కీ బాత్’లో మాట్లాడారు. ప్రస్తుత తరుణంలో యువ మిత్రుల గురించి ఆలోచిస్తుంటారని చెబుతూ, వారు ఆట బొమ్మలను ఎలా సమకూర్చుకుంటున్నారని మధనపడుతున్నట్టు వివరించారు. బాల్యంలో బొమ్మలకు ప్రాధాన్యత ఉంటుందని, చిన్నప్పుడే పిల్లల్లో ఆలోచన శక్తి పెరగడానికి ఇవి దోహదపడుతాయని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా బొమ్మల ప్రాధాన్యతపై చర్చించారని గుర్తుచేశారు. పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసేవే ఉత్తమమైన బొమ్మలని వివరించారు.
కంప్యూటర్ గేమ్స్ కూడా చాలా ఫేమస్ అని, యువకులు, వృద్ధులూ వీటిని ఆడుతారని ప్రధాని చెప్పారు. అయితే, చాలా వరకు అందులో పాశ్చాత్య ప్రభావంతో ఉంటాయని, భారతీయత ప్రతిబింబించే గేమ్‌లను సృష్టించాలని ఆయన ఎంటర్‌ప్రెన్యూర్‌లకు సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇనోవేషన్ చాలెంజ్‌లో భాగంగా అద్భుతమైన యాప్‌లు వస్తున్నాయని అన్నారు. గణితం, సామాన్యశాస్త్రం నేర్చుకోవడానికి కుటుకికిడ్స్ లర్నింగ్ యాప్, అభిప్రాయాలు, భావాలు పంచుకునేందుకు మైక్రోబ్లాగింగ్ ‘కూ’ బాగుందని చెప్పారు.