వారికి దేశ ప్రజలందరి సపోర్ట్ అవసరం : ప్రధాని మోడీ

దిశ, స్పోర్ట్స్ : విశ్వ క్రీడలు మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఇండియా నుంచి 118 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పలు క్రీడా విభాగాల్లో పోటీ పడటానికి వెళ్లనున్నారు. ఈ నెల 17న భారత బృందం టోక్యో బయలు దేరి వెళ్లనున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఒలింపిక్స్ సన్నాహకాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ‘130 కోట్ల భారతీయుల తరపున ఒలింపిక్స్‌లో పాల్గొననున్న అథ్లెట్లతో జులై 13న మాట్లాడనున్నాను. వారికి ముందస్తు అభినందనలు తెలిపి.. వారిలో […]

Update: 2021-07-09 20:19 GMT

దిశ, స్పోర్ట్స్ : విశ్వ క్రీడలు మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఇండియా నుంచి 118 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పలు క్రీడా విభాగాల్లో పోటీ పడటానికి వెళ్లనున్నారు. ఈ నెల 17న భారత బృందం టోక్యో బయలు దేరి వెళ్లనున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఒలింపిక్స్ సన్నాహకాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ‘130 కోట్ల భారతీయుల తరపున ఒలింపిక్స్‌లో పాల్గొననున్న అథ్లెట్లతో జులై 13న మాట్లాడనున్నాను. వారికి ముందస్తు అభినందనలు తెలిపి.. వారిలో స్పూర్తిని నింపడానికి ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాను.

అలాగే నేడు నిర్వహించిన సమీక్షలో అథ్లెట్ల సన్నాహకాలు, వారి వాక్సినేషన్ ప్రక్రియ, ఇతర విషయాలపై సమీక్ష నిర్వహించాను. భారత అథ్లెట్లకు దేశ ప్రజలందరి సపోర్ట్ అవసరం.’ అని మోడీ సమీక్షకు సంబంధించిన వివరాలు ట్వీట్ చేశారు. భారత అథ్లెట్ల తొలి బృందం ఈ నెల 17న టోక్యో వెళ్లనున్నది. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు సమ్మర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి.

Tags:    

Similar News