నేడు రైతులతో ప్రధాని భేటీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 24న రైతులతో ఆన్‌లైన్‌లో భేటీ కానున్నారు. తొమ్మిది కోట్ల మంది రైతులతో మాట్లాడనున్నారు. కొత్త సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయనున్నారు. పీఎం కిసాన్ పథకం మరో విడతకు రూ. 18వేల కోట్లను విడుదల చేయనున్నారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన కర్షకులను ఆయన నేరుగా అడిగి తెలుసుకోనున్నట్టు […]

Update: 2020-12-23 06:25 GMT

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 24న రైతులతో ఆన్‌లైన్‌లో భేటీ కానున్నారు. తొమ్మిది కోట్ల మంది రైతులతో మాట్లాడనున్నారు. కొత్త సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయనున్నారు. పీఎం కిసాన్ పథకం మరో విడతకు రూ. 18వేల కోట్లను విడుదల చేయనున్నారు.

రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన కర్షకులను ఆయన నేరుగా అడిగి తెలుసుకోనున్నట్టు పీఎంవో ఓ ప్రకనలో పేర్కొంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలకు కౌంటర్‌గా బీజేపీ దేశవ్యాప్తంగా 100 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, 700 సమావేశాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News