బస్టాండ్‌ను బాగు చేయండి: బంట్వారం ప్రజలు
దిశ బంట్వారం: మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. బస్టాండ్ ఏ క్షణానైన కూలడానికి సిద్ధంగా ఉంది. అయినా పట్టించుకునే నాథుడే లేడు. ఒకటి రెండు సార్లు బంట్వారం మండలానికి చెందిన కొంతమంది నాయకులు, యువకులు కలిసి తాండూర్ బస్ డిపో డీఎం గారిని కలిసి గ్రామ ప్రజలు వినతిపత్రాన్ని అందజేశారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేదు. హైదరాబాద్- తాండూర్- వికారాబాద్ ప్రాంతాల నుంచి ప్రయాణికులు నిత్యం ఇక్కడ నుంచే ప్రయాణం చేస్తూ ఉంటారు. […]
దిశ బంట్వారం: మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. బస్టాండ్ ఏ క్షణానైన కూలడానికి సిద్ధంగా ఉంది. అయినా పట్టించుకునే నాథుడే లేడు. ఒకటి రెండు సార్లు బంట్వారం మండలానికి చెందిన కొంతమంది నాయకులు, యువకులు కలిసి తాండూర్ బస్ డిపో డీఎం గారిని కలిసి గ్రామ ప్రజలు వినతిపత్రాన్ని అందజేశారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేదు.
హైదరాబాద్- తాండూర్- వికారాబాద్ ప్రాంతాల నుంచి ప్రయాణికులు నిత్యం ఇక్కడ నుంచే ప్రయాణం చేస్తూ ఉంటారు. వర్షాకాలం వచ్చిందంటే బస్టాండ్ ఆవరణ మొత్తం బురద గుంటల మారిపోతుంది. ప్రస్తుత సర్పంచ్ శ్రీనివాస్ లావణ్య, ఎంపీటీసీ పద్మా వెంకటేశం గతంలో బస్టాండ్‌లో కొంచెం మట్టి వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినారు. అయినప్పటికీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బస్టాండ్ మొత్తం బురద గుంటల కనిపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.