ప్లాస్మా థెరపీ వల్ల ప్రాణానికి ప్రమాదం?

దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారి నుంచి బయటపడటానికి ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలను ఇస్తోందని వైద్యులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్లాస్మా థెరపీని ఇంకా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చీ ఆమోదించలేదని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రోజువారీ మీడియా సమావేశ బ్రీఫింగ్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ కొన్ని హెచ్చరికలు చేశారు. దేశవ్యాప్తంగా కొన్ని ఆసుపత్రులు ప్లాస్మా థెరపీని ఉపయోగిస్తున్నారు. అది […]

Update: 2020-04-28 06:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారి నుంచి బయటపడటానికి ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలను ఇస్తోందని వైద్యులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్లాస్మా థెరపీని ఇంకా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చీ ఆమోదించలేదని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రోజువారీ మీడియా సమావేశ బ్రీఫింగ్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ కొన్ని హెచ్చరికలు చేశారు.

దేశవ్యాప్తంగా కొన్ని ఆసుపత్రులు ప్లాస్మా థెరపీని ఉపయోగిస్తున్నారు. అది మంచిఫలితాలనే ఇస్తున్నప్పటికీ ఆ విధానం ఇంకా ఐసీఎంఆర్ ఆమోదం పొందలేదని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్లాస్మా థెరపీ విధానం ఇంకా ప్రయోగదశలోనే ఉందని, సరైన విధానాలు పాటించకపోతే దాని వల్ల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని లవ్ అగర్వాల్ అన్నారు. అధికారికంగా కరోనా వైరస్ నిర్మూలించడానికి ఎలాంటి ట్రీట్‌మెంట్ లేదని, వ్యాక్సిన్ లేదా మందు కనిపెట్టేవరకు సామాజిక దూరం పాటిస్తే మంచిదని ఆయన సలహా ఇచ్చారు.

Tags: corona, covid 19, lockdown, treatment, plasma therapy, dangerous, luv agarwal, Union health ministry

Tags:    

Similar News