మొక్కలు నాటు.. గన్ పట్టు!

దిశ, వెబ్‌డెస్క్: చెట్లను పెంచడానికి ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వందల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ.. మొక్కల పెంపకానికి నడుం బిగించాయి. తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరిట ఏటా కోట్ల మొక్కలను నాటుతోంది. మొక్కల సంరక్షణను స్థానిక సంస్థలకు అప్పగించి కఠిన నిబంధనలను పెట్టింది. అలాగే పంజాబ్ రాష్ట్రం కూడా మొక్కల పెంపకానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింద. యువతను చైతన్యం తెచ్చేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పంజాబ్‌లో గన్‌కల్చర్ ఎక్కువ. అక్కడి యువత ఎక్కువ […]

Update: 2020-07-30 11:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెట్లను పెంచడానికి ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వందల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ.. మొక్కల పెంపకానికి నడుం బిగించాయి. తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరిట ఏటా కోట్ల మొక్కలను నాటుతోంది. మొక్కల సంరక్షణను స్థానిక సంస్థలకు అప్పగించి కఠిన నిబంధనలను పెట్టింది. అలాగే పంజాబ్ రాష్ట్రం కూడా మొక్కల పెంపకానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింద. యువతను చైతన్యం తెచ్చేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

పంజాబ్‌లో గన్‌కల్చర్ ఎక్కువ. అక్కడి యువత ఎక్కువ గన్ ఫైరింగ్‌కు ఇష్టపడుతుంటారు. మన ఇండియాలో ఎక్కువగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఈ గన్‌కల్చర్ ఉన్నది. అయితే పంజాబ్ లోని పాటియాలా ప్రభుత్వం మొక్కలను పెంచడానికి ఈ గన్‌కల్చర్నే వాడుకుంటున్నది. గన్ లైసెన్స్ పొందాలి అంటే కనీసం 10 మొక్కలు నాటాలని, అలా నాటిన గన్ లైసెన్స్ ఇస్తామని చెప్పడంతో లైసెన్స్ కోసం యువత మొక్కలు నాటడం మొదలుపెట్టింది. ఇదే విధానాన్ని మిగతా శాఖల్లో కూడా అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నది.

Tags:    

Similar News