విసుగు చెంది ఆ పని చేసిన సీఐ.. చప్పట్లు కొడుతున్న జనం
దిశ, ఇల్లందు: ఇల్లందు పట్టణంలోని విద్యుత్ ఆఫీస్ ప్రాంతంలో రోడ్డు గుంతలమయం కావడంతో ప్రయాణికులు గతకొంత కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు సైతం పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివిధ శాఖల అధికారులు అదే మార్గంలో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు తప్ప ఎవరు కూడా జోక్యం చేసుకోకపోవడం విచారకరమని పట్టణ ప్రజలు వాపోతున్నారు. స్థానిక సీఐ బరపటి రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ గుంతలను పూడ్చారు. దీంతో ప్రయాణికులు సీఐ రమేష్ కు […]
దిశ, ఇల్లందు: ఇల్లందు పట్టణంలోని విద్యుత్ ఆఫీస్ ప్రాంతంలో రోడ్డు గుంతలమయం కావడంతో ప్రయాణికులు గతకొంత కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు సైతం పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివిధ శాఖల అధికారులు అదే మార్గంలో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు తప్ప ఎవరు కూడా జోక్యం చేసుకోకపోవడం విచారకరమని పట్టణ ప్రజలు వాపోతున్నారు. స్థానిక సీఐ బరపటి రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ గుంతలను పూడ్చారు. దీంతో ప్రయాణికులు సీఐ రమేష్ కు అభినందనలు తెలిపారు.