అజ్ఞాతంలోకి పితాని కుమారుడు
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.ఏపీలో ఈఎస్‌ఐ స్కాం కేసులో ఏసీబీ దూకుడు పెంచడంతో ఆ కేసు తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని ముందస్తుగా స్టెప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే పితాని కుమారుడు వెంకట సురేష్ హైదరాబాద్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పితాని మంత్రిగా ఉన్న సమయంలో మందులు కొనుగోలుకు సిఫారసు చేసినట్లుగా గుర్తించారు. ఈ రోజు ఉదయం పితాని పీఏ మురళి మోహన్‌ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. […]
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.ఏపీలో ఈఎస్‌ఐ స్కాం కేసులో ఏసీబీ దూకుడు పెంచడంతో ఆ కేసు తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని ముందస్తుగా స్టెప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే పితాని కుమారుడు వెంకట సురేష్ హైదరాబాద్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పితాని మంత్రిగా ఉన్న సమయంలో మందులు కొనుగోలుకు సిఫారసు చేసినట్లుగా గుర్తించారు. ఈ రోజు ఉదయం పితాని పీఏ మురళి మోహన్‌ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, ముందస్తు బెయిల్ కోసం పితాని కుమారుడు సురేష్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ఇప్పటికే ఏపీ ఏసీబీ బృందం సురేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు హైదరబాద్‌కు చేరుకుంది.
ఏనాడు తన తండ్రి పదవిని దుర్వినియోగం చేయలేదని.. కేవలం రాజకీయ కక్షతోనే ఇందులో ఇరికించారని కోర్టుకు వివరించినట్లుగా తెలుస్తోంది. తన కార్యదర్శికి ఈ వ్యవహారంలో సంబంధం లేదని..ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.
అయితే, వెంకట సురేష్ తరఫు న్యాయవాది వాదనలను విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వులో ఉంచారు. కానీ ఇంతలోనే పోలీసులు మాజీ పీఏ మురళిని అరెస్ట్ చేశారు. దీంతో పితాని సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సురేష్ హైదరాబాద్ లో ఉన్నట్లుగా ఏపీ ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.