తీన్మార్ మల్లన్నకు షాక్.. పోలీసులకు కంప్లైంట్

దిశ, చౌటుప్పల్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును కించపరుస్తూ క్యూ న్యూస్ ఛానల్ లో ప్రసారం చేసిన  చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని చౌటుప్పల్ ఏసీపీకి టీఆర్ఎస్ నేత, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ శనివారం ఫిర్యాదు చేశారు. మైనర్ బాలుడైన హిమాన్షుపై అసభ్య పదజాలం వాడుతూ క్యూ న్యూస్ ఛానల్ లో ప్రసారం చేసినందున అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏసీపీ ఉదయ్ రెడ్డిని […]

Update: 2021-12-25 06:36 GMT

దిశ, చౌటుప్పల్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును కించపరుస్తూ క్యూ న్యూస్ ఛానల్ లో ప్రసారం చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని చౌటుప్పల్ ఏసీపీకి టీఆర్ఎస్ నేత, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ శనివారం ఫిర్యాదు చేశారు. మైనర్ బాలుడైన హిమాన్షుపై అసభ్య పదజాలం వాడుతూ క్యూ న్యూస్ ఛానల్ లో ప్రసారం చేసినందున అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏసీపీ ఉదయ్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా పిల్లలమర్రి శ్రీనివాస్ మాట్లాడుతూ… కేటీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీన్మార్ మల్లన్న ప్రసారం ఉన్నదని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ తడక చంద్రకిరణ్, గ్రంథాలయ చైర్మన్ ఊడుగు మల్లేష్ గౌడ్, ఎండి.రహీం, టీఆర్ఎస్వీ నియోజకవర్గ కార్యదర్శి ముటుకుల్లోజు రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News