బ్రేకింగ్: దళితబంధుపై హైకోర్టులో పిల్
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని ఉప ఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్‌లో నిలిపేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ సామాజిక వేత్త గురువారం తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దళితబంధును నిలిపివేయాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోర్టును పిటిషనర్ కోరారు. హుజురాబాద్‌లో ప్రభుత్వ పథకాలన్నీ అమలవుతున్నప్పుడు కేవలం దళితబంధును నిలిపేయాలనడం సరికాదని సూచించారు. […]
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని ఉప ఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్‌లో నిలిపేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ సామాజిక వేత్త గురువారం తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దళితబంధును నిలిపివేయాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోర్టును పిటిషనర్ కోరారు. హుజురాబాద్‌లో ప్రభుత్వ పథకాలన్నీ అమలవుతున్నప్పుడు కేవలం దళితబంధును నిలిపేయాలనడం సరికాదని సూచించారు. దళితబంధు పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పిల్‌లో పేర్కొన్నారు.