కాలు విరిగిన కరోనా పేషెంట్‌కు చికిత్స

దిశ, జగిత్యాల: జగిత్యాల మండలం అంతర్గాం గ్రామనికి చెందిన గీత కార్మికుడు శంకర్ గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాలు విరిగింది. వైద్యం కోసం కరీంనగర్ లోని ఓ ఆస్పత్రికి వెళ్లగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఇంటి వద్దే హోం ఐసోలేషన్ లో ఉంటున్న శంకర్ గౌడ్ బాధతో నరకయాతన అనుభవించాడు. ఈ విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆర్దోపెడిక్ నవీన్, అసిస్టెంట్ రవికిరణ్ […]

Update: 2020-08-16 03:38 GMT

దిశ, జగిత్యాల: జగిత్యాల మండలం అంతర్గాం గ్రామనికి చెందిన గీత కార్మికుడు శంకర్ గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాలు విరిగింది. వైద్యం కోసం కరీంనగర్ లోని ఓ ఆస్పత్రికి వెళ్లగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఇంటి వద్దే హోం ఐసోలేషన్ లో ఉంటున్న శంకర్ గౌడ్ బాధతో నరకయాతన అనుభవించాడు. ఈ విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆర్దోపెడిక్ నవీన్, అసిస్టెంట్ రవికిరణ్ తో కలిసి పీపీఈ కిట్స్ ధరించి శంకర్ గౌడ్ కు ఇంట్లోనే చికిత్స అందించారు.

కరోనాతో పోరాడుతున్నప్పటికీ లక్షణాలు అంతగా లేవని, తలకు గాయం కావటంతో కంటికీ కూడా ఇబ్బంది కలిగిందని, నొపులు భరించలేక నరకయాతన అనుభవిస్తున్నందున తక్షణ వైద్యం అందించామని వైద్యులు పేర్కొన్నారు. కరోనా నెగెటివ్ ఫలితం అనంతరం పూర్తి స్థాయిలో శస్త్ర చికిత్స అందిస్తామని కుటుంబభ్యులకు వైద్యులు అభయమిచ్చారు. ఈ సందర్భంగా వైద్యులకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News