‘ఆసరా’ ఇంకెప్పుడిస్తరు..? కేసీఆర్ పై దివ్యాంగుల ఆగ్రహం
దిశ, జగిత్యాల : తెలంగాణలోని వృద్ధులకు నేటికీ ఆసరా పెన్షన్ అందలేదు. సెప్టెంబర్ నెలలో రావాల్సిన పింఛన్ ఈనెల 19 తారీఖు వచ్చినా దివ్యంగులకు, వృద్ధులకు ప్రభుత్వం నుంచి పెన్షన్లు అందడం లేదని దివ్యాంగుల సంఘం నాయకులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఆసరా పింఛన్లు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరైన పద్దతి కాదన్నారు. పెన్షన్లు అందక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో […]
దిశ, జగిత్యాల : తెలంగాణలోని వృద్ధులకు నేటికీ ఆసరా పెన్షన్ అందలేదు. సెప్టెంబర్ నెలలో రావాల్సిన పింఛన్ ఈనెల 19 తారీఖు వచ్చినా దివ్యంగులకు, వృద్ధులకు ప్రభుత్వం నుంచి పెన్షన్లు అందడం లేదని దివ్యాంగుల సంఘం నాయకులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఆసరా పింఛన్లు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరైన పద్దతి కాదన్నారు.
పెన్షన్లు అందక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో దివ్యాంగులు, వృద్ధులు జిల్లాల రహదారిపై రాస్తారోకోలు చేసే పరిస్థితి వస్తుందన్నారు. ప్రతీ నెల 1 నుంచి 5 తేదీ వరకు ఆసరా పెన్షన్లు అందేలా చూడాలని సీఎం కేసీఆర్‌ను జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు లంకదాసరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి, అజ్గర్ మహమ్మద్ ఖాన్ తెలిపారు.