అగ్నిమాపక కేంద్రంలో పెట్రోలు బంక్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త ప్రయోగాలు నిర్వహిస్తోంది. విజయవాడ నుంచి మంగళగిరి జాతీయ రహదారి ప్రక్కన ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరహాలోనే గుడివాడలో అగ్నిమాపక కేంద్రం ఆవరణలో పెట్రోల్ బంక్‌ను నిర్మించారు. దీనిని అగ్నిమాపక శాఖ నిర్వహించనుంది. ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ అందించేందుకు భారత్ పెట్రోలియం సంస్థ, అగ్నిమాపక సంస్థ కలిసి ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశాయి. గతంలో ఇలాంటి బంక్‌ను కైకలూరులో ఏర్పాటు చేశారు. దాని స్పూర్తితో […]

Update: 2020-02-20 01:59 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త ప్రయోగాలు నిర్వహిస్తోంది. విజయవాడ నుంచి మంగళగిరి జాతీయ రహదారి ప్రక్కన ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరహాలోనే గుడివాడలో అగ్నిమాపక కేంద్రం ఆవరణలో పెట్రోల్ బంక్‌ను నిర్మించారు. దీనిని అగ్నిమాపక శాఖ నిర్వహించనుంది. ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ అందించేందుకు భారత్ పెట్రోలియం సంస్థ, అగ్నిమాపక సంస్థ కలిసి ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశాయి. గతంలో ఇలాంటి బంక్‌ను కైకలూరులో ఏర్పాటు చేశారు. దాని స్పూర్తితో గుడివాడలో రెండోది ఏర్పాటు చేశారు. ఈ బంక్‌ను బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు రోబో వ్యవస్థను తీసుకురానున్నామని ఈ సందర్భంగా బాలశౌరి తెలిపారు.

Tags:    

Similar News