జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలి.. సుప్రీంలో పిటిషన్ !
దిశ, ఏపీ బ్యూరో: జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలతో లేఖను విడుదల చేసిన వైఎస్ జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఎం జగన్‌పై సుమారు 30క్రిమినల్ కేసులున్నాయని ఆరోపిస్తూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్‌లు పిటిషన్ వేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా సీఎం జగన్‌పై మండిపడుతోంది. సీజేఐకి సీఎం జగన్ లేఖ రాయడాన్ని తప్పుబట్టింది. న్యాయవ్యవస్థను కించపరిచేలా జగన్ లేఖ […]
దిశ, ఏపీ బ్యూరో: జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలతో లేఖను విడుదల చేసిన వైఎస్ జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఎం జగన్‌పై సుమారు 30క్రిమినల్ కేసులున్నాయని ఆరోపిస్తూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్‌లు పిటిషన్ వేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా సీఎం జగన్‌పై మండిపడుతోంది. సీజేఐకి సీఎం జగన్ లేఖ రాయడాన్ని తప్పుబట్టింది. న్యాయవ్యవస్థను కించపరిచేలా జగన్ లేఖ రాయడాన్ని ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ తెలిపింది.