బ్రేకింగ్ : ‘లక్కీ డ్రా’ తీయాలంటూ ఆత్మహత్యాయత్నం.. పొలాల్లోకి పరుగెత్తి..!

దిశ ప్రతినిధి, కరీంనగర్ : జగిత్యాల జిల్లాలో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా తీస్తున్న క్రమంలో ఓ టెండర్ దారుడు శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లాలోని సారంగాపూర్ మద్యం దుకాణం గెజిట్ నంబర్ 043కి 6 టెండర్లు మాత్రమే వచ్చాయి. నిబంధనల ప్రకారం 10 లోపు టెండర్లు వచ్చిన దుకాణాలకు లక్కీ డ్రా తీయకూడదని ఉంది. దీంతో అధికారులు 2 రోజుల పాటు వాయిదా వేశారు. అయితే, ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని సారంగాపూర్ మద్యం దుకాణానికి […]

Update: 2021-11-20 05:51 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : జగిత్యాల జిల్లాలో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా తీస్తున్న క్రమంలో ఓ టెండర్ దారుడు శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లాలోని సారంగాపూర్ మద్యం దుకాణం గెజిట్ నంబర్ 043కి 6 టెండర్లు మాత్రమే వచ్చాయి. నిబంధనల ప్రకారం 10 లోపు టెండర్లు వచ్చిన దుకాణాలకు లక్కీ డ్రా తీయకూడదని ఉంది.

దీంతో అధికారులు 2 రోజుల పాటు వాయిదా వేశారు. అయితే, ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని సారంగాపూర్ మద్యం దుకాణానికి టెండర్ వేసిన జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌కు చెందిన కాసారపు రమేష్ ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. టెండర్ ప్రక్రియ నిర్వహిస్తున్న ఏబీ కన్వెన్షన్ హాలు సమీపంలోని పంట పొలాల్లోకి పరుగెత్తాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుంటూ పరిగెత్తి నిప్పటించుకునేందుకు యత్నించగా, అక్కడే ఉన్న జగిత్యాల రూరల్ సీఐ కృష్ణ కుమార్ రమేష్‌ను వెంటపడి పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది.

epaper – 4:00 PM TS EDITION (20-11-21) చదవండి

Tags:    

Similar News