48డిగ్రీ కాలేజీల అనుమతులు రద్దు !
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 48డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి అనుమతులు రద్దు చేసింది. కొన్నింటికి విశ్వ విద్యాలయాల అఫ్లియేషన్ లేకపోవడం, మరికొన్నింటికి ప్రవేశాలు లేకుండానే నిర్వహించడం, ఇంకొన్ని ప్రవేశాలు 25శాతం దాటలేదనే కారణాలతో మొత్తం 246కాలేజీలకు ఉన్నత విద్యా మండలి నోటీసులు జారీ చేసింది. అందులో కొన్ని కళాశాలల యాజమాన్యాలు విచారణ కమిటీ ఎదుట హాజరై రాత పూర్వక సమాధానమిచ్చాయి. మరికొన్ని అసలు విచారణకే హాజరు కాలేదు. చివరిగా కమిటీ ఇచ్చిన […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 48డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి అనుమతులు రద్దు చేసింది. కొన్నింటికి విశ్వ విద్యాలయాల అఫ్లియేషన్ లేకపోవడం, మరికొన్నింటికి ప్రవేశాలు లేకుండానే నిర్వహించడం, ఇంకొన్ని ప్రవేశాలు 25శాతం దాటలేదనే కారణాలతో మొత్తం 246కాలేజీలకు ఉన్నత విద్యా మండలి నోటీసులు జారీ చేసింది. అందులో కొన్ని కళాశాలల యాజమాన్యాలు విచారణ కమిటీ ఎదుట హాజరై రాత పూర్వక సమాధానమిచ్చాయి. మరికొన్ని అసలు విచారణకే హాజరు కాలేదు. చివరిగా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్‌కుమార్ రద్దు చేసిన కాలేజీల జాబితా విడుదల చేశారు. మరో 61 కాలేజీల్లో కొన్ని ప్రోగ్రాములను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు.