వైద్యశాఖలో 334 పోస్టుల భర్తీకి అనుమతి
దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యవిధాన పరిషత్‌లో 334 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఔట్ సోర్సింగ్ పద్దతిలో 9 బ్లడ్ బ్యాంకులు, 31 బడ్ల్ స్టోరేజ్ సెంటర్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్లడ్ బ్యాంకుల్లో మెడికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నిషియన్, ల్యాబ్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్, డ్రైవర్‌లను మొత్తం 117 మంది సిబ్బందిని భర్తీ చేయనున్నారు. బ్లడ్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యవిధాన పరిషత్‌లో 334 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఔట్ సోర్సింగ్ పద్దతిలో 9 బ్లడ్ బ్యాంకులు, 31 బడ్ల్ స్టోరేజ్ సెంటర్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్లడ్ బ్యాంకుల్లో మెడికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నిషియన్, ల్యాబ్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్, డ్రైవర్‌లను మొత్తం 117 మంది సిబ్బందిని భర్తీ చేయనున్నారు.
బ్లడ్ స్టోరేజ్ సెంటర్లలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నిషియన్, ఆఫీస్ అటెండర్‌లను మొత్తం 217మందిని భర్తీ చేనున్నారు. 2022 మార్చి 31 వరకు సేవలు వినియోగించుకునేలా ఒప్పంద ప్రాతిపదికన సిబ్బందిని విధుల్లోకి తీసుకోనున్నారు.