కపిల్ మిశ్రాలాంటివారిని తొలగించాలి : మనోజ్ తివారీ
విద్వేషపు ప్రసంగాలే ఢిల్లీలో బీజేపీ కొంప ముంచాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్‌ను టెర్రరిస్టుతో పోల్చిన బీజేపీ ఎంపీ ప్రవేష్ వర్మ, ఆయన వ్యాఖ్యలను సమర్థించిన ప్రకాష్ జవడేకర్‌పై అభిప్రాయాన్ని కోరగా.. అదెటువంటి సందర్భమైనా సరే.. ఆ వ్యాఖ్యలు ద్వేషపూరితమైనవేనని తెలిపారు. ద్వేష ప్రసంగాలే ఢిల్లీలో బీజేపీకి నష్టాన్ని చేకూర్చాయని అన్నారు. ప్రవేష్ వర్మ ప్రసంగాన్నిఅప్పుడే ఖండించామని చెప్పారు. విద్వేష ప్రసంగాలు ఎవరు చేసినా వారికి పనిష్‌మెంట్ ఇవ్వాలని, దేశద్రోహులను కాల్చిపారేయండని […]
విద్వేషపు ప్రసంగాలే ఢిల్లీలో బీజేపీ కొంప ముంచాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్‌ను టెర్రరిస్టుతో పోల్చిన బీజేపీ ఎంపీ ప్రవేష్ వర్మ, ఆయన వ్యాఖ్యలను సమర్థించిన ప్రకాష్ జవడేకర్‌పై అభిప్రాయాన్ని కోరగా.. అదెటువంటి సందర్భమైనా సరే.. ఆ వ్యాఖ్యలు ద్వేషపూరితమైనవేనని తెలిపారు. ద్వేష ప్రసంగాలే ఢిల్లీలో బీజేపీకి నష్టాన్ని చేకూర్చాయని అన్నారు. ప్రవేష్ వర్మ ప్రసంగాన్నిఅప్పుడే ఖండించామని చెప్పారు. విద్వేష ప్రసంగాలు ఎవరు చేసినా వారికి పనిష్‌మెంట్ ఇవ్వాలని, దేశద్రోహులను కాల్చిపారేయండని పలికిన పార్టీ సభ్యుడు కపిల్ మిశ్రా అయినాసరే చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. అంతటి ద్వేషాన్ని చిమ్మేవారిని శాశ్వతంగా తొలగించాలని అన్నారు. అటువంటి ప్రతిపాదనను తీసుకొస్తే.. తాను వ్యక్తిగతంగా మద్దతునిస్తానని చెప్పారు.