కశ్మీరీలపై పెగాసెస్ నిఘా?
న్యూఢిల్లీ: పెగాసెస్ స్పైవేర్‌తో ట్యాప్ చేసిన లేదా ట్యాప్ చేయడానికి లక్ష్యంగా ఎంచుకున్నవారిలో కనీసం 25 మంది కశ్మీరీలున్నట్టు తేలింది. 2017-19 కాలంలో వీరిపై నిఘా వేయాలని, లేదా వేసినట్టు ది వైర్ న్యూస్ పోర్టల్ తాజా కథనంలో పేర్కొంది. ఇందులో ముఫ్తీ కుటుంబీకులు, వేర్పాటువాద నేతలు ఎస్ఏఆర్ గిలానీ, బిలాల్ లోనె పేర్లు లీక్ అయిన జాబితాలో ఉన్నాయని తెలిపింది. జమ్ము కశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుకారి సోదరుడు తారీఖ్ బుకారీ, సయ్యద్ […]
న్యూఢిల్లీ: పెగాసెస్ స్పైవేర్‌తో ట్యాప్ చేసిన లేదా ట్యాప్ చేయడానికి లక్ష్యంగా ఎంచుకున్నవారిలో కనీసం 25 మంది కశ్మీరీలున్నట్టు తేలింది. 2017-19 కాలంలో వీరిపై నిఘా వేయాలని, లేదా వేసినట్టు ది వైర్ న్యూస్ పోర్టల్ తాజా కథనంలో పేర్కొంది. ఇందులో ముఫ్తీ కుటుంబీకులు, వేర్పాటువాద నేతలు ఎస్ఏఆర్ గిలానీ, బిలాల్ లోనె పేర్లు లీక్ అయిన జాబితాలో ఉన్నాయని తెలిపింది. జమ్ము కశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుకారి సోదరుడు తారీఖ్ బుకారీ, సయ్యద్ అలీ షా గిలానీ కుటుంబ సభ్యులు, మిర్వేజ్ ఉమర్ ఫరూఖ్‌లూ లిస్టులో చోటుసంపాదించుకుంటున్నట్టు వివరించింది.
కశ్మీరీ జర్నలిస్టులు ముజమిల్ జలీల్, ఔరంగజేబు నాక్ష్‌బందీ, ఇఫ్తికర్ గిలానీ, సునీల్ కౌల్‌ల నెంబర్లనూ లక్ష్యంగా చేసుకున్నట్టు పేర్కొంది. పెగాసెస్ అభివృద్ధి చేసిన ఇజ్రాయెలీ సంస్థ ఎన్ఎస్‌వో నుంచి లీక్ అయిన వివరాలను ఆమ్నెస్టీ 17 మీడియా సంస్థలతో పంచుకుంటున్నది. ఇందులో భారత్ నుంచి ది వైర్ సంస్థ ఉన్నది. ఈ సంస్థ తాజాగా కశ్మీరీల నెంబర్లపైనా నిఘా జరిగి ఉండే అవకాశమున్నదని పేర్కొంది. దీనిపై మెహెబూబా ముఫ్తీ స్పందించడానికి తిరస్కరించారు. నిఘా నీడన మెలగడం కశ్మీరీలకు కొత్తేమీ కాదని ముఫ్తీ వివరించారు. కేవలం నిఘా వరకే పరిమితమవడం కాదు, కొన్నిసార్లు అధికారులు పనిష్మెంట్లూ ఇచ్చేవారని వివరించారు. శుక్రవారం రోజు ఢిల్లీ పోలీసులు ది వైర్ సంస్థ ఆఫీసుకు వెళ్లి తనిఖీలు చేశారు. ఆగస్టు 15 సందర్భంగా రోటీన్ చెక్‌అప్‌లు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.