బూతుపురాణం ఎఫెక్ట్ : కాంగ్రెస్ లీడర్‌కు షోకాజ్ నోటీసు
దిశప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్, మంథని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశిభూషన్ కాచేకు పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజున మంథని సోషల్ మీడియా ఇన్‌చార్జి ఆరెల్లి కిరణ్‌ను దుర్భాషలాడారు. రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంథని సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేశావంటూ కిరణ్ […]
దిశప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్, మంథని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశిభూషన్ కాచేకు పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజున మంథని సోషల్ మీడియా ఇన్‌చార్జి ఆరెల్లి కిరణ్‌ను దుర్భాషలాడారు. రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంథని సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేశావంటూ కిరణ్ పై కాచే బూతు పురాణం ఓపెన్ చేశారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అసభ్య పదజాలంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని దూషించిన విషయం తన దృష్టికి వచ్చిందని ఈర్ల కొమురయ్య వివరించారు. పార్టీ నియమ నిబంధనల ప్రకారం శశిభూషన్ కాచే వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో 8 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఈ సందర్భంగా ఆదేశించారు.