అసలేం జరుగుతోంది.. పుట్ట మిస్సింగ్ మిస్టరీ వీడేనా?

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పుట్ట మధు మిస్సింగ్ మిస్టరీ ఓ కట్టు కథ… ఆయన అధిష్టానానికి టచ్‌లోనే ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తే క్రిమినల్ కేసులు పెడ్తాం అంటూ సోషల్ మీడియాలో వార్నింగ్‌లు ఇచ్చారు పుట్ట మధు యువసేన సైనికులు. మరి గురువారం సాయంత్రం జరిగిన పరిణామాలకు ఏం సమాధానం చెప్తారు.? అసలేం జరిగింది. ఏమౌతోంది? పుట్ట మధు ఓ సామాన్య వక్యి అయితే అయన మిస్సయాడన్న వార్త అ వీధికే పరిమితం అవుతుంది. […]

Update: 2021-05-06 09:58 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పుట్ట మధు మిస్సింగ్ మిస్టరీ ఓ కట్టు కథ… ఆయన అధిష్టానానికి టచ్‌లోనే ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తే క్రిమినల్ కేసులు పెడ్తాం అంటూ సోషల్ మీడియాలో వార్నింగ్‌లు ఇచ్చారు పుట్ట మధు యువసేన సైనికులు. మరి గురువారం సాయంత్రం జరిగిన పరిణామాలకు ఏం సమాధానం చెప్తారు.? అసలేం జరిగింది. ఏమౌతోంది?

పుట్ట మధు ఓ సామాన్య వక్యి అయితే అయన మిస్సయాడన్న వార్త అ వీధికే పరిమితం అవుతుంది. అదే ఓ అసమాన్య వ్యక్తి అదృశ్యం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమే అవుతుంది. కానీ వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాను కసితో తొక్కుతామని హెచ్చరించిన వారికి ఈ ఘటనే ప్రధాన సాక్ష్యం. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పుట్ట మధు భార్య శైలజ కలిసినట్టు మీడియాలో ప్రకటనలు వస్తున్నాయి.

ట్విస్ట్ ఇచ్చిన శైలజ…

పుట్ట మధు భార్య, మంథని మునిసిపల్ చైర్ పర్సన్ ట్విస్ట్ ఇచ్చారు. కొద్ది సేపటి క్రితం ఆర్‌అండ్‌బీ మినిస్టర్‌ను కలిసి తన భర్త జాడ తెలపాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పుట్ట మధు గురించి స్థానికంగా ఉండే మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లను కలవకుండా వేములను కలవడమే విచిత్రంగా ఉంది. తన భర్త, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు విషయంలో చొరవ తీసుకునే పరిస్థితి ఉమ్మడి జిల్లాలోని మంత్రులకు లేదా? లేక ఇక్కడి నాయకులకు పొసగడం లేదా అన్నదే టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

వేములకు ఫిర్యాదు వెనక..

ఐదు రోజులుగా పుట్ట మధు మిస్సింగ్ మిస్టరీపై వరస కథనాలు వస్తున్నా గురువారం సాయంత్రం వరకు స్పందించని ఆయన కుంటుంబ సభ్యులు ఉన్నట్టుండి మంత్రి వేముల ఇంటి వద్ద ప్రత్యక్ష్యం అయి వేడుకోవడం అంటే అంతర్గతంగా ఏం జరుగుతోందన్నదే పెద్ద చర్చగా సాగుతోంది. ఇప్పటి వరకు ఆయన యోగా కేంద్రంలో ఉన్నాడు, కూతురు దగ్గరకు వెల్లాడు, అనారోగ్యంతో ఉన్నాడు, కావాలనే మీడియా దుష్ప్రచారం చేస్తోంది అని చెప్పి ప్రచారం చేయడానికి కారణాలు ఏంటీ? ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశారా లేక తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు చట్టాన్ని దుర్వినియోగం చేశారా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

నో కంప్లైంట్.. ఓన్లీ రిక్వెస్ట్..

లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడానికి ఇప్పటికీ పుట్ట మధు కుటుంబం ఎందుకు వెనకాడుతోందన్నదే అర్థం కాకుండా పోయింది. మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసినప్పుడు కూడా తమ బాధను చెప్పుకున్న శైలజ ఓ దరాఖస్తు మాత్రం చేయలేదు. మధు మిస్సింగ్ అయ్యిందెక్కడ, ఆమె ఎవరికి విన్నవించుకుంది అన్న కోణంలో తొంగి చూస్తే కూడా అనుమానాలకు తావిస్తోంది. పుట్ట మధు మిస్సింగ్ మిస్టరీ ఆమెకు తెలిసే ఆరు రోజులుగా వెయిట్ చేశారా? లేక మరేదైనా కారణం ఉందా అన్నదే అంతు చిక్కకుండా తయారైంది.

వాచ్ డాగ్స్..

పుట్ట మధు మిస్సింగ్ తరువాత నుంచి రాష్ట్ర నిఘా వర్గాలు అన్ని కూడా ఆయన అంతరంగీకులపై వాచ్‌డాగ్ లా అబ్జర్వ్ చేస్తున్నాయి. పుట్ట మధు సన్నిహితులు, స్నేహితులు, బంధువులు ఇలా ఒక్కరేమిటీ అన్ని వర్గాలపై నిఘా కళ్లు కంటిమీద కునుకు లేకుండా గమనిస్తున్నాయి. వారి ఆర్థిక లావా దేవీలు, వారి ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Tags:    

Similar News