పీడీసీ టీ-10తో మాకు సంబంధం లేదు
దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో శ్రీలంకలో తిరిగి క్రికెట్ ప్రారంభించడానికి పీడీసీ టీ-10 లీగ్ నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీలంకకు చెందిన అజింత మెండిస్, చమర సిల్వా, నువాన్ కులశేఖర వంటి స్టార్ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడతారని నిర్వాహకులు చెప్పారు. శ్రీలంకలోని చారిత్రాత్మక అనురాధపురలోని సమధి క్రికెట్ గ్రౌండ్‌లో 12 రోజుల పాటు ఈ లీగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ పీడీసీ టీ-10 లీగ్‌తో శ్రీలంక క్రికెట్ బోర్డుకు, రాష్ట్రాల అసోసియేషన్లకు, జిల్లా […]
దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో శ్రీలంకలో తిరిగి క్రికెట్ ప్రారంభించడానికి పీడీసీ టీ-10 లీగ్ నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీలంకకు చెందిన అజింత మెండిస్, చమర సిల్వా, నువాన్ కులశేఖర వంటి స్టార్ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడతారని నిర్వాహకులు చెప్పారు. శ్రీలంకలోని చారిత్రాత్మక అనురాధపురలోని సమధి క్రికెట్ గ్రౌండ్‌లో 12 రోజుల పాటు ఈ లీగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ పీడీసీ టీ-10 లీగ్‌తో శ్రీలంక క్రికెట్ బోర్డుకు, రాష్ట్రాల అసోసియేషన్లకు, జిల్లా అసోసియేషన్లకు ఏ మాత్రం సంబంధం లేదని బోర్డు తేల్చి చెప్పింది. శ్రీలంక క్రికెట్‌తో సంబంధం లేని వ్యక్తులే దీన్ని నిర్వహిస్తున్నారని, ఆటగాళ్లెవరూ ఇందులో పాల్గొనరాదని అల్టిమేటం జారీ చేసింది. ఈ లీగ్‌పై ఇప్పటికే ఐసీసీకి కూడా పిర్యాదు చేశామని, కాబట్టి ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. శ్రీలంక క్రికెట్ చేసిన ప్రకటనతో పీడీసీ టీ-10 లీగ్‌ను రద్దు చేసినట్లు సమాచారం.