‘వింగ్ కమాండర్ చనిపోవడం కలచివేసింది’
దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు, 17 మంది ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమని జనసేనాని అన్నారు. మృతులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ప్రయాణం చివరి నిముషాల్లో ఊహించని ప్రమాదం జరగడం విధి వైపరీత్యంగా ఆయన అభివర్ణించారు. అయితే, ఈ విమానం నడిపిన వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్‌లు విమానయానంలో ఎంతో అనుభవం ఉన్న పైలెట్లు అని చెప్పారు. అయినప్పటికీ విమానం ప్రమాదానికి గురవడం […]
దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు, 17 మంది ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమని జనసేనాని అన్నారు. మృతులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ప్రయాణం చివరి నిముషాల్లో ఊహించని ప్రమాదం జరగడం విధి వైపరీత్యంగా ఆయన అభివర్ణించారు.
అయితే, ఈ విమానం నడిపిన వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్‌లు విమానయానంలో ఎంతో అనుభవం ఉన్న పైలెట్లు అని చెప్పారు. అయినప్పటికీ విమానం ప్రమాదానికి గురవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా వింగ్ కమాండర్ దీపక్ భారత వాయుసేనలో చిరస్మరణీయమైన సేవలు అందిచారన్నారు. వ్యక్తిగతంగా కూడా వింగ్ కమాండర్ తనకు తెలుసని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇదే ప్రమాదంలో అతను కూడా మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందంటూ.. పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.