నాకు కెప్టెన్సీ మీద ఆసక్తి లేదు.. తేల్చి చెప్పిన పాట్ కమిన్స్
దిశ, స్పోర్ట్స్: టిమ్ పైన్ రాజీనామాతో ఖాళీ అయిన ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్సీని పాట్ కమిన్స్‌కు కట్టబెట్టిన విషయం తెలిసిందే. 65 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించిన కమిన్స్‌కు వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీపై మాత్రం ఆసక్తి లేదని చెప్పాడు. తనకు ఇచ్చిన టెస్ట్ కెప్టెన్సీకి న్యాయం చేయాలని భావిస్తున్నానని.. పూర్తి దృష్టి సుదీర్ఘ ఫార్మాట్ పైనే పెడతానని.. అందుకే పరిమిత ఓవర్ల కెప్టెన్సీపై ఆసక్తి […]
దిశ, స్పోర్ట్స్: టిమ్ పైన్ రాజీనామాతో ఖాళీ అయిన ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్సీని పాట్ కమిన్స్‌కు కట్టబెట్టిన విషయం తెలిసిందే. 65 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించిన కమిన్స్‌కు వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీపై మాత్రం ఆసక్తి లేదని చెప్పాడు. తనకు ఇచ్చిన టెస్ట్ కెప్టెన్సీకి న్యాయం చేయాలని భావిస్తున్నానని.. పూర్తి దృష్టి సుదీర్ఘ ఫార్మాట్ పైనే పెడతానని.. అందుకే పరిమిత ఓవర్ల కెప్టెన్సీపై ఆసక్తి చూపించడం లేదని కమిన్స్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఇద్దరు కెప్టెన్లు ఉండటమే మంచిదని కమిన్స్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ క్రికెట్, వైట్ బాల్ క్రికెట్‌కు వేర్వరు కెప్టెన్లు ఉండటం వల్ల చక్కని ఫలితాలు వస్తాయని చెప్పాడు. ఇటీవలే పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయాన్ని అతడు గుర్తు చేస్తున్నాడు. ఫించ్ అద్భుతంగా పని చేస్తున్నాడని.. ఇలాంటి సమయంలో ఆ వాతావరణాన్ని చెడగొట్టడం మంచిది కాదని కమిన్స్ అన్నాడు. ఫించ్ కనీసం 2023 వన్డే వరల్డ్ కప్ వరకు జట్టును నడిపిస్తాడని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.