రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమగ్ర ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. సంప్రదాయం ప్రకారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టాల్సి ఉంది. వరుసగా రెండు రోజులు సెలవులు (శని, ఆదివారాలు) వస్తుండటంతో పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజునే ఆర్థిక […]
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమగ్ర ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. సంప్రదాయం ప్రకారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టాల్సి ఉంది. వరుసగా రెండు రోజులు సెలవులు (శని, ఆదివారాలు) వస్తుండటంతో పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజునే ఆర్థిక సర్వేను ప్రవేశ పెడుతున్నారు.