ఆ నవ్వుల వెనక సీక్రెట్ అదే!

మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుంచి ట్రిపుల్ హానర్స్ డిగ్రీ చేసి.. తిరిగి ఇండియాకు వచ్చేసిన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా. ఆ తర్వాత యశ్‌రాజ్ ఫిలింస్ కంపెనీలో పీఆర్ కన్సల్టెంట్‌గా పనిచేసి.. అదే సంస్థ నుంచి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. బాలీవుడ్‌లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ పంజాబీ భామ.. ఇన్‌స్టా వేదికగా ఓ సరికొత్త చాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. పరిణీతి చోప్రా.. గతంలో మాల్దీవులకు వెళ్లిన ఓ ఫోటోను గురువారం ఇన్‌స్టాలో షేర్ […]

Update: 2020-07-02 06:08 GMT

మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుంచి ట్రిపుల్ హానర్స్ డిగ్రీ చేసి.. తిరిగి ఇండియాకు వచ్చేసిన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా. ఆ తర్వాత యశ్‌రాజ్ ఫిలింస్ కంపెనీలో పీఆర్ కన్సల్టెంట్‌గా పనిచేసి.. అదే సంస్థ నుంచి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. బాలీవుడ్‌లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ పంజాబీ భామ.. ఇన్‌స్టా వేదికగా ఓ సరికొత్త చాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది.

పరిణీతి చోప్రా.. గతంలో మాల్దీవులకు వెళ్లిన ఓ ఫోటోను గురువారం ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో హొయలుపోతున్న ఈ క్యూటీ డాల్.. ఓ స్టైల్ క్యాప్ కూడా పెట్టుకుని ఉండటం విశేషం. ఆ అందానికి చిరునవ్వులు జతకలిశాయి. అయితే.. ఆ నవ్వుల వెనక ఉన్న సీక్రెట్ ఏంటో వివరించింది పరిణీతి. ‘ప్రతి నవ్వు వెనుక ఓ స్టోరీ దాగి ఉంటుంది. నాది చాలా సింపుల్ స్టోరీ. నేను ప్రతి మూడు నెలలకోసారి ఐలాండ్‌కు వెళ్లి.. డైవింగ్ చేస్తుంటాను. ఈ లాక్‌డౌన్ వేళ.. మనందరి నవ్వుల వెనక ఉన్న కారణాలను పంచుకుందాం. అందుకు ఫుడ్, ఫ్యామిలీ, మ్యూజిక్ ఏ కారణమైనా సరే. నేను ఈ చాలెంజ్‌ను నా పాగల్ ఫ్రెండ్ సను( టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా)తో స్టార్ట్ చేస్తున్నాను’ అని పరిణీతి తెలిపారు.

https://www.instagram.com/p/CCIP3IkJ47K/?utm_source=ig_web_copy_link

Tags:    

Similar News