టీచర్ ఇంటి ఎదుట పంచాయతీ కార్యదర్శి శవం.. అసలేం జరిగింది?

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అనుమానాస్పద స్థితి‌లో పంచాయతీ కార్యదర్శి మరణించిన ఘటన మంగళవారం ఉదయం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మద్నూర్ మండలం విట్టల్ వాడి‌కీ చెందిన రాథోడ్ మోహన్ (24) జుక్కల్ నియోజకవర్గం‌లోని కొండపగల్ మండల కేద్రంలో పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను పిట్లంలో అద్దెకు ఉంటున్నాడు. సోమవారం రాత్రి ఓ గవర్నమెంట్ టీచర్ ఇంటిముందు విగత జీవిగా పడి ఉన్నాడు. అయితే సంఘటన స్థలంలో […]

Update: 2021-05-31 22:13 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అనుమానాస్పద స్థితి‌లో పంచాయతీ కార్యదర్శి మరణించిన ఘటన మంగళవారం ఉదయం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మద్నూర్ మండలం విట్టల్ వాడి‌కీ చెందిన రాథోడ్ మోహన్ (24) జుక్కల్ నియోజకవర్గం‌లోని కొండపగల్ మండల కేద్రంలో పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను పిట్లంలో అద్దెకు ఉంటున్నాడు.

సోమవారం రాత్రి ఓ గవర్నమెంట్ టీచర్ ఇంటిముందు విగత జీవిగా పడి ఉన్నాడు. అయితే సంఘటన స్థలంలో మోహన్ తల పగిలి, అధిక రక్తశ్రావమై మరణించినట్టు ఆనవాళ్లున్నాయి. రాత్రి ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కిందపడి చనిపోయాడా లేక మరేదైనా జరిగిందా అనే అనుమానలున్నాయి. మోహన్ ది హత్యనా, ఆత్మహత్యనా, ప్రమాదవ శాత్తు జరిగిన ఘటన అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని లోకల్ ఎస్ఐ రంజిత్ పరిశీలించారు. మోహన్ ఒక యువతితో ప్రేమలో ఉన్నాడని, సోమవారం రాత్రి అతనితో ఉన్న స్నేహితులని విచారిస్తే అసలు విషయం వెలుగు లోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News