ఏసీబీ వలలో భారీ తిమింగలం.. ఇంట్లోనే రూ.35 లక్షల నగదు

  ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. పైడిభీమవరం పంచాయతీ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న వెంకట్రావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. కార్యాలయంతో పాటు ఏకకాలంలో మూడు చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, ఆభరణాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోనే సుమారు రూ. 35 లక్షల పత్రాలు నగదు స్వాధీనం చేసుకున్నారు. […]

Update: 2021-04-16 02:20 GMT

ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. పైడిభీమవరం పంచాయతీ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న వెంకట్రావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. కార్యాలయంతో పాటు ఏకకాలంలో మూడు చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, ఆభరణాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోనే సుమారు రూ. 35 లక్షల పత్రాలు నగదు స్వాధీనం చేసుకున్నారు. విలువైన బంగారు నగలు, ఆభరణాలు, వెండి వస్తువులు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇళ్ళ స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్నట్లు పత్రాలు లభ్య కావడంతో సీజ్ చేశారు. అంతేగాకుండా… విజయనగరం జిల్లాలో భారీగా భూములు కూడబెట్టినట్లు ఆధారాలు లభ్యం అయ్యాయి. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రామమూర్తి ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇంకా పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Tags:    

Similar News