శతకం బాదిన వృద్ధుడు.. ఘనంగా సత్కరించిన బంధువులు

దిశ, చిగురుమామిడి: ఒకటి కాదు రెండు కాదు వందేళ్ళ పాటు చిరంజీవిగా ఉన్నాడు. ఆరు పదుల వయసు రాగానే ఆచేతనులుగా మారిపోయిన వారికి ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పల్లె వెంకట్ రెడ్డి(వందేళ్లు పూర్తి చేసుకున్నారు) సెంచరీ కొట్టారు. శతాధిక వృద్ధున్ని అభినందిస్తూ, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వృద్ధుడు వెంకట రెడ్డికి ఒక కొడుకు, ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఆయన మునిమనువలు, మనువరాళ్ళతో పాటు నాలుగో తరాన్ని కూడా […]

Update: 2021-10-16 10:49 GMT

దిశ, చిగురుమామిడి: ఒకటి కాదు రెండు కాదు వందేళ్ళ పాటు చిరంజీవిగా ఉన్నాడు. ఆరు పదుల వయసు రాగానే ఆచేతనులుగా మారిపోయిన వారికి ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పల్లె వెంకట్ రెడ్డి(వందేళ్లు పూర్తి చేసుకున్నారు) సెంచరీ కొట్టారు. శతాధిక వృద్ధున్ని అభినందిస్తూ, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వృద్ధుడు వెంకట రెడ్డికి ఒక కొడుకు, ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఆయన మునిమనువలు, మనువరాళ్ళతో పాటు నాలుగో తరాన్ని కూడా చూశారు. ఇప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా తనపని తాను చేసుకోవడమే కాకుండా నిత్యం వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళి పనులను పర్యవేక్షిస్తున్నారు.

శనివారం శత జన్మదినం సందర్భంగా కుమారుడు మల్లారెడ్డి, మనువడు శ్రీధర్ రెడ్డి, మేన బావమరుదులు బాల్ రెడ్డి, మల్లారెడ్డి, చంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మనువలు రమణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రజినీకాంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు శాలువాతో సత్కరించి టపాసులు కాల్చి వైభవంగా సంబురాలు జరుపుకున్నారు.

Tags:    

Similar News