కరోనా పేరిట జైలు నుంచి లష్కరే తోయిబా చీఫ్ విడుదల
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా వైరస్‌తో విలవిల్లాడుతుంటే.. మన దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం ఎప్పటిలా తన పని తాను చేసుకొని పోతోంది. కరోనా కంటే భారత్‌కు వ్యతిరేకంగా చేపట్టే చర్యలే ఆ దేశానికి ప్రాముఖ్యంగా కనపడుతోంది. ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడి చర్యలు చేపడితే.. పాకిస్తాన్ మాత్రం కరోనా పేరుతో తమకు అనుకూలమైన ఉగ్రవాదులను విడిచిపెట్టింది. ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో నుంచి పలువురి పేర్లను తొలగిస్తున్నట్లు ఒక అమెరికా ఏజెన్సీ ప్రకటించింది. దీనిపై భారత్ […]
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా వైరస్‌తో విలవిల్లాడుతుంటే.. మన దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం ఎప్పటిలా తన పని తాను చేసుకొని పోతోంది. కరోనా కంటే భారత్‌కు వ్యతిరేకంగా చేపట్టే చర్యలే ఆ దేశానికి ప్రాముఖ్యంగా కనపడుతోంది. ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడి చర్యలు చేపడితే.. పాకిస్తాన్ మాత్రం కరోనా పేరుతో తమకు అనుకూలమైన ఉగ్రవాదులను విడిచిపెట్టింది. ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో నుంచి పలువురి పేర్లను తొలగిస్తున్నట్లు ఒక అమెరికా ఏజెన్సీ ప్రకటించింది. దీనిపై భారత్ సహా పలు దేశాలు అభ్యంతరం తెలిపాయి. ఏకంగా ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో పెడతానని హెచ్చరించింది. అయినా సరే పాకిస్తాన్ తన వైఖరి మార్చుకోలేదు. తాజాగా లాహోర్ జైలులో పెద్ద సంఖ్యలో ఉన్న ఉగ్రవాదులకు కరోనా సోకిందని పాకిస్తాన్ ప్రకటించింది. వారి ఆరోగ్యం కాపాడే నిమిత్తం జైలు నుంచి విడుదల చేశామని చెబుతోంది. వీరిలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా ఉండటం గమనార్హం. కాగా, పాకిస్తాన్ ఉగ్రవాదానికి తోడ్పాటు అందిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆర్థిక ఆంక్షలు విధించాలని భారత్ సహా పలు దేశాలు కోరాయి. దీనిపై జూన్‌లో ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం తీసుకోనుంది.
Tags: Coronavirus, Lashkar – e- Tayyiba, LeT, Pakistan, India,FATF