అధికారులకు భయం లేకుండా పోయింది : పద్మనాభరెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతి కట్టడిలో విజిలెన్స్ కమిషన్ సంస్థ కీలకమైందని, గత ఏడేళ్ల నుంచి విశ్రాంత పోలీసు అధికారి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారని దీంతో పారదర్శకత, జవాబుదారీ తనం లోపించిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి అన్నారు. శుక్రవారం అవినీతిని అరికట్టడంలో ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదని అవినీతి నిరోధకశాఖకు కమిషనర్‌ను నియమించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి ఆయన లేఖ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి […]
దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతి కట్టడిలో విజిలెన్స్ కమిషన్ సంస్థ కీలకమైందని, గత ఏడేళ్ల నుంచి విశ్రాంత పోలీసు అధికారి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారని దీంతో పారదర్శకత, జవాబుదారీ తనం లోపించిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి అన్నారు. శుక్రవారం అవినీతిని అరికట్టడంలో ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదని అవినీతి నిరోధకశాఖకు కమిషనర్‌ను నియమించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి ఆయన లేఖ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి తారాస్థాయికి చేరిందని, పౌరుడికి చట్టబద్ధంగా అందాల్సిన సేవలకు సైతం లంచం ఇవ్వడం తప్పడం లేదని ఆరోపించారు. అవినీతి అరికట్టేందుకు ఏసీబీ చర్యలు చేపట్టినప్పటికీ ఆ కేసులను సచివాలయంలో నీరుగారుస్తున్నారని ఆరోపించారు.
అవినీతి నిరోధకశాఖ, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్, సీబీసీఐడీ, ట్రిబ్యునల్ మరియు విజిలెన్స్ కమిషన్ కీలకమైనవని, అయితే ప్రస్తుతం అనిశా మరియు సీఐడీకిపై అధికారి లేక డీజీ వారు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యమైన ఈ మూడు శాఖలకు ఒకే అధికారి ఉండి ఏ శాఖకు కూడా న్యాయం చేయలేక పోతున్నాడన్నారు. ఇక ట్రిబ్యునల్‌కు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఇప్పి వరకు జడ్జి లేక వందల సంఖ్యలో కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అవినీతిని అదుపులో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలతో పాటు ఎమ్మెల్యేలకు కూడా తెలియడం లేదన్నారు.
పారదర్శకత, జవాబుదారీ తనం లేని ప్రభుత్వ చర్యలతో అవినీతికి ఊతమిచ్చినట్లు ఉందని, దీంతో రాష్ట్రంలో ఏ ఉద్యోగికి కూడా తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖలకు అధికారులను, సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.