CS Review: ఉపరాష్ట్రపతి రెండు రోజుల పర్యటన..500 మంది రైతులతో ముఖాముఖి.. సీఎస్ సమీక్ష

ఈ నెల 25, 26వ తేదీల్లో రెండు రోజుల పాటు భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ థన్కర్ రాష్ట్ర పర్యటన చేయనున్నారు.

Update: 2024-12-21 11:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 25, 26వ తేదీల్లో రెండు రోజుల పాటు  భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ థన్కర్ (Jagdeep Dhankhar) రాష్ట్ర పర్యటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) శనివారం తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి ఐసీఏఆర్ (ICAR)- కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారని, అక్కడే సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న 500 మంది రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారని సీఎస్ తెలిపారు.

25వ తేదీ రాత్రి (Kanha Shanti Vanam) కన్హా శాంతివనంలో బస చేస్తారని పేర్కొన్నారు. ఈ పర్యటన జరిగే రెండు రోజుల పాటు బ్లూ బుక్ ప్రకారం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్‌లు, ఉప రాష్ట్రపతి కార్యాలయంతో, అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు.

Tags:    

Similar News